ఉరుకుంద స్వామి విశిష్ఠత:
ఒక ముని పేరు హిరణ్య (ఎక్కువ పిలిచేది ఈరన్న లేదా వీరన్న )ఇతను చాల సంవత్సరాల వరకు రావి చెట్టు కింద తపస్సు చేసేవారు ఉరుకుంద గ్రామమం లో. అక్కడ ఉన్న ముగా జీవులు అతని చుట్టు చేరుతాయి . ఆ ముని వాటి ఆలనా పాలనా చూసేవాడు . అక్కడ గ్రామ ప్రజలు ముని కోసం అని పండ్లు మఱియు తినే పదార్థలు యిచ్చి అశీర్వాదాలు పొందేవారు.
ఈ గ్రామ ప్రజలందరు ఆ ముని దెగ్గర వైద్యం పొందేవారు.
ఒక రోజు , ఆ ముని రావి చెట్టు కిందనుండి అదృశ్యం ఐపోయారు. అదే సమయానికి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి విగ్రహం ఆ చెట్టు కింద వెలిసింది. ఆ తర్వాత నుండి చెట్టు కింద వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి విగ్రహానికి గ్రామప్రజలందరూ పూజలు మొదలుపెట్టారు .
అక్కడ ప్రజలకి ఆ ముని విగ్రహాన్ని,నరసింహ స్వామి విగ్రహం పక్కన ప్రతిష్టించాలని అనుకున్నారు.ఎందుకంటె ఆ గ్రామానికి క్షేత్రపాలకుడి లాగా ఉండేవారు. తరవాత ఆ గ్రామప్రజలందరు కలిసి వెండి విగ్రహాన్ని తయారు చేపించారు ,ఆ విగ్రహానికి వీరభద్ర స్వామి అని పేరు పెట్టారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి విగ్రహం పక్కనే వీరభద్ర స్వామి విగ్రహం ప్రతిష్టించారు .
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి విగ్రహానికి మరియు వీరభద్ర స్వామి విగ్రహానికి , వీర శైవ సాంప్రదాయ పద్ధతిలో ఇప్పటి వరకు పూజలు అదే సంప్రదాయం లోనే జరుగుచున్నవి.
ఇప్పటివరకు రావి చెట్టుకి పూజలు , అభిషేకాలు జరుగుచున్నవి. కొన్ని వేల మంది భక్తులు వచ్చి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీర్వాదాలు పొందుతారు.
ఒక సారి గురు రాఘవేంద్ర స్వామి తుంగభద్ర నది తీరమున ప్రయాణిస్తుండగా వారి శిష్యులకి ఉరుకుంద గుడి ప్రత్యేకతలు చెప్పి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మరియు వీరభద్ర స్వామి దర్శనమునకై తీసుకొనివచ్చారు.
ఈ గుడి ప్రత్యేకంగా సోమవారం ,గురువారం ,అమావాస్య రోజులో చాలా భక్తులతో నిండి ఉంటుంది మరియు శ్రావణ మాసం లో గుడిని చాలా ప్రత్యేకంగా అలంకరిస్తారు .శ్రావణ మాసం లో కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు.
ప్రతి సంవత్సరం పది నుండి పదిహేను లక్షల మంది భక్తులు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నీ దర్శించుకుంటారు. ప్రతి నెల మూడవ సోమవారం భక్తులు గుడి ప్రాంగణంలో తాత్కాలిక పొయ్యి ద్వారా చెక్కర పొంగలి తయారు చేసి నైవేద్యంగా ఈరన్న స్వామికి సమర్పిస్తారు. అదే రోజు ఇక్కడ కుండపోతగా వర్షం కురుస్తుంది కానీ ఇక్కడ తడిచిన తాత్కాలిక కట్టెల పొయ్యి తోనే నైవేద్యము తయారు చేసి స్వామికి సమర్పిస్తారు.అది ఇక్కడ ఈరన్న స్వామి మహిమ లా ఇక్కడ ప్రజలు భావిస్తారు.
కార్తీకమాస నెలలో చివరి సోమవారం ఈరన్న స్వామికి తుంగభద్ర నదిలో స్వామివారికి పలికిసేవ ,అభిషేకము జరుగును. భక్తులు విబూదిని స్వామి వారికీ కానుకగా సమర్పిచి కొంత విబూదిని భక్తులచే ఇంటికి తీసుకొని వెళ్తారు. భక్తులు ఎవరేనా అనారోగ్యంగా ఉన్నపుడు ఆ విబూదిని నుదిటి పైన రాసుకుంటే తమ ఆరోగ్యం కుదుటపడుతుంది అని భక్తులు నమ్ముతారు. అది ఈరన్న స్వామి మహిమ.
ఈ గ్రామ చుట్టు భక్తులందరూ సంవత్సరానికి ఒకసారైనా వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు , ప్రత్యేకంగా శ్రావణ మాస నెలల్లో ఎక్కువ దర్శించుకుంటారు. భక్తులు స్వామివారికి బియ్యం ,పప్పు,మరియు బెల్లం కానుకలుగా సమర్పిస్తారు,ఇలా సమర్పిచిన కానుకలను ప్రసాదం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ నెలల్లో వచ్చే విరాళాలు సుమారుగా కొట్టి రూపాయలతో ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు .
వివాహ వేడుకలు ప్రారంభించేటపుడు ఈరన్న స్వామి ఆశీర్వాదాలు పొందుతారు. అన్ని ఆచారాలు ముగిసాక పెళ్ళికొడుకు ,పెళ్లికూతురు స్వామి వారి డేగరికి వచ్చి దర్శించుకుంటారు . ఆ తర్వాత దంపతులకి పిల్లలు పుట్టాక స్వామి వారి దెగరికి వచ్చి శిరోజాలను స్వామి వారికీ సమర్పిస్తారు . ఇది ఇక్కడ ఉన్న ఉరుకుంద స్వామి మహిమ ఇక్కడ ప్రజలందరూ స్వామి వారిని బాగా నమ్ముతారు.





